గణతంత్ర వేడుకల్లో భాగంగా యుద్ధ విమానాలకు పక్షులు అడ్డురాకుండా ఢిల్లీ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. ఇందుకోసం సుమారు 1275 కిలోల బోన్‌లెస్ చికెన్‌ను వినియోగిస్తోంది. గాలిలో ఎగిరే పక్షులను విమాన మార్గాల నుంచి దారి మళ్లించేందుకు వివిధ ప్రాంతాల్లో ఈ మాంసాన్ని వెదజల్లుతారు. వన్యప్రాణుల రక్షణతో పాటు పరేడ్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు ఇలా చేయనున్నారు.