JGL: మల్యాల మండలం కొండగట్టు బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం,కొండగట్టు,ధర్మపురి,కోటిలింగాల పుణ్య క్షేత్రాలను టెంపుల్ సిటీ కారిడార్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. కొండగట్టు గిరిప్రదక్షిణ మార్గం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.