VZM: కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా శుక్రవారం స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఇంఛార్జ్ కౌశిక్ ఈశ్వర్ నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు యువజన విద్యార్థి విభాగాలకు ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారని అడిగారు. జాబ్ క్యాలెండర్ వంటి హామీలను ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.