BHNG: మోటకొండూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కుర్చీలు, గ్యాస్ స్టవ్, ఫ్యాన్‌తో పాటు చిన్నారులకు అవసరమయ్యే పలు వస్తువులను గ్రామానికి చెందిన దాత జూకంటి మధు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సేవాభావంతో ముందుకొచ్చిన దాత మధును అభినందించారు.