TG: మేడారం జాతర కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఈనెల 18న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మేడారంకు వస్తున్నారని అన్నారు. ఈనెల 19న గద్దెల వద్ద నిర్మించిన నూతన నిర్మాణాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఏడాది 251 కోట్లతో మేడారం జాతర కోసం పనులు చేపట్టామన్నారు. జాతర ప్రశాంతంగా జరిగే విధంగా ఆదివాసులందరి సహకారం తీసుకొని పనులు పూర్తి చేస్తున్నామన్నారు.