MNCL: దండేపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు చేశారు. భోగి మంటలు, ముగ్గులు వేశారు. చిన్నారులు గాలి పతంగులను ఎగురవేశారు.