ATP: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద బోయ నల్లప్పకు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. గార్లదిన్నె మండలం ముంటిమడుగు గ్రామంలోని బాధితుని పరిస్థితి తెలుసుకున్న ఆయన మెరుగైన వైద్యం కోసం ఈ మొత్తం అందించారు. కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడం సంతోషంగా ఉందని కేశవరెడ్డి పేర్కొన్నారు.