NLR: గ్రామీణ యువతలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని గ్రామీణ యువతకు వీపీఆర్ నివాసంలో క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 30 క్రికెట్ కిట్లు, 15 వాలీబాల్ కిట్లను యువతకు అందజేశారు. ప్రతిభఉన్న యువకులను ప్రోత్సహిస్తే వారు జాతీయస్థాయిలో రాణిస్తారని ఆమె ఆకాంక్షించారు.