VZM: మెంటాడ మండలంలో DEO మాణిక్యం నాయుడు గురువారం ఆండ్ర, జీ.టి.పేట, మెంటాడ హైస్కూళ్లను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో రికార్డులు, వాతావరణం, పరిశుభ్రత, టెన్త్ విద్యార్థుల విద్యా స్థితిగతులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం, 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలుపై ఆయన సమీక్షించి, సిబ్బందితో చర్చించి తగు సూచనలు చేశారు.