AKP: నాతవరం జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్, బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర పాల్గొని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 9 వినతులు స్వీకరించారు. భూసమస్యలు, పింఛన్లు, ఇళ్ల పట్టాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.