హనుమకొండ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఇంగ్లీషులో మాట్లాడేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజు గౌడ్ పాల్గొన్నారు.