»Do You Know How 18 Runs In One Ball Tamilnadu League 2023
TNPL 2023: ఒక్క బంతికి 18 రన్స్ ఎలాగో తెలుసా?
చెపాక్ సూపర్ గిల్లీస్, సేలం స్పార్టాన్స్ మధ్య మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తన్వర్ ఇన్నింగ్స్(Abhishek Tanwar) ముగించడానికి ఒక డెలివరీలో 18 పరుగులు ఇచ్చి సరికొత్త రికార్డును సృష్టించాడు.
మంగళవారం రాత్రి కోయంబత్తూర్‌లోని తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2023లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో చెపాక్ సూపర్ గిల్లీస్‌తో జరిగిన ఆటలో సేలం స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్(Abhishek Tanwar) ఒక బాల్ డెలివరీ కోసం ఏకంగా 18 పరుగులు ఇచ్చేశాడు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన తర్వాత చెపాక్ 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఆ క్రమంలో ఆటకు దిగిన సంజయ్ యాదవ్ 12 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. TNPL 2022 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన తన్వర్ చివరి ఓవర్లో చివరి బంతికి 18 పరుగులతో సహా 26 పరుగులు ఇచ్చాడు.
తన్వర్ మొదట 19వ ఓవర్ చివరి బంతి నో బాల్ విసిరాడు. ఆ క్రమంలో బ్యాటర్ ఔట్ అయ్యాడు. కానీ నో బాల్ కావడంతో అది సింగిల్‌కి దారితీసింది. ఆ తర్వాత అతను మరో నో బాల్ వేయగా.. అది సిక్సర్ కొట్టగా 8 పరుగులు వచ్చాయి. అతను మళ్ళీ మూడో నో బాల్ని వేశాడు. అది క్రింది ఫ్రీ హిట్లో రెడు పరుగులకు దారి తీసింది. తర్వాత అతను ఓ ఫ్రీ హిట్ కింద వైడ్‌ని ఇచ్చాడు. అయితే చివరి బంతికి బౌలర్ మాములుగానే వేశాడు. కానీ చివరి బంతిని బ్యాటర్ సిక్స్ కొట్టి ఏకంగా 18 పరుగులు చేశాడు.
అయితే ఒక డెలివరీలో గరిష్ట పరుగులు తన్వర్ చేసిన 18 కాకపోవడం విశేషం. 2013-14 బిగ్ బాష్ లీగ్ సీజన్లో క్లింట్ మెక్కేపై ట్రావిస్ బిర్ట్ ఒక బంతికి 20 పరుగులు చేశాడు. 2004 ODI ఎన్కౌంటర్లో భారత వీరేంద్ర సెహ్వాగ్ ఒక బంతికి 17 పరుగుల వద్ద పాకిస్తాన్ పేసర్ రాణా నవేద్-ఉల్-హసన్‌ను చిత్తు చేశాడు.
The most expensive final delivery in history – 18 runs from the last ball of the 20th over. pic.twitter.com/rf8b0wMhOw