W.G: అమరావతిలోని సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుని తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లీ రాధాకృష్ణ సోమవారం కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గానికి సంబంధించి రానున్న రోజుల్లో యూరియా అవసరాలు మరియు వ్యవసాయ యాంత్రికరణ గురించి చర్చించడం జరిగింది. అలాగే పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.