AKP: కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మాజీ ఎంపీ పప్పల చలపతిరావు అన్నారు. ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ ముందుకు వెళ్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ కోరారు.