AP: సంక్రాంతి వస్తున్న వేళ రాష్ట్రంలో పందెం కోళ్లు కూతపెడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు కోడిపందేలకు పెట్టింది పేరు. బరిలోకి దిగే కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కోడికి రోజూ ఉదయాన్నే డ్రైఫ్రూట్ లడ్డూ, ఖీమా పెడుతుంటారు. జనంలో ఉన్నప్పుడు భయపడకుండా ఉండేందుకు చేత్తో మేత పెడతారు. చురుగ్గా ఉండేలా వారానికి ఒకటి రెండుసార్లు నీటిలో ఈత కొట్టిస్తారు.