PPM: మెళుకువలు నేర్చుకుంటే లెక్కలు సులభంగా అర్థమవుతాయని రిటైర్ IPS అధికారి ఉప్పాడ రవిప్రకాశ్ తెలిపారు. ఆదివారం సాలూరులో ఆర్య వైశ్య ధర్మశాల ఆధ్వర్యంలో UCMAS కార్యక్రమం నిర్వహించారు. పిల్లల్లో ప్రాథమిక స్థాయి నుంచే గణితం పట్ల ఉన్న భయం పొగట్టాలన్నారు. లెక్కలు వస్తే మిగతా సబ్జెక్టులు సులభం అవుతాయన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.