TG: జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో ఆందోళన వద్దని సమాచారశాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక స్పష్టం చేశారు. డెస్క్ జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదని, ప్రభుత్వ వసతులన్నీ వర్తిస్తాయని TWJF నేతలకు హామీ ఇచ్చారు. మంత్రి పొంగులేటితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని CM సీపీఆర్వో మల్సూర్ భరోసా ఇచ్చారు. కాగా, రిపోర్టర్లు, డెస్క్ అనే వివక్ష లేకుండా అందరికీ కార్డులు ఇవ్వాలని సంఘం కోరింది.