AP: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 3, 4, 5 తేదీల్లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. 5వ తేదీ సాయంత్రం జరిగే సమాపనోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నట్లు తెలిపారు. తెలుగు మహా సభల ప్రత్యేక సంచిక ‘ఆంధ్ర మేవ జయతే’, 3వ ప్రపంచ తెలుగు మహా సభల పోస్టల్ కవర్ను సీఎం విడుదల చేస్తారని వెల్లడించారు.