TG: ఆదిలాబాద్ ఆదివాసీలకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుభవార్త చెప్పారు. కుమ్మరికుంట గూడెం వాళ్లను ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ టూర్కు తీసుకెళ్తామని ప్రకటించారు. అడవి దాటి బయటి ప్రపంచం చూడని వీరికి.. మెట్రో, ఆకాశహర్మ్యాలు, చారిత్రక కట్టడాలు చూపిస్తారట. రవాణా, భోజన ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా వీరి బతుకులు మారలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.