TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. దీని ఆధారంగా స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే ప్రక్రియ మొదలైంది. ఇది సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పులకు పునాది వేసింది. కానీ న్యాయపరమైన చిక్కులతో రిజర్వేషన్ల ప్రక్రియలో అంతరాయం ఏర్పడింది. ఇది రాజకీయంగా ప్రకంపనలకు కారణమవుతోంది. వచ్చే ఏడాది కూడా ఇవి కీలకంగా మారే అవకాశం ఉంది.