AP: శ్రీకాకుళం జిల్లాలో రౌడీరాజ్యం నడుస్తోందని MLC దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. ‘బెదిరింపు కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాను. ధర్మాన సోదరుల కుట్రలను మీడియా ముందు పెట్టినందుకే కుట్ర చేశారు. నా హత్యకు ప్లాన్ చేస్తున్నారని ఓ అభిమాని చెప్పాడు. నాకు ప్రాణహాని జరిగితే ధర్మాన సోదరులదే బాధ్యత’ అని పేర్కొన్నారు.