WGL: మోంథా తుఫాను వల్ల సర్వస్వం కోల్పోయిన శివనగర్, మైసయ్య నగర్ బాధితులు శనివారం WGL జిల్లా కేంద్రంలో మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా మాట్లాడుతూ.. సర్వే నిర్వహించి అర్హులకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. బాధితులకు త్వరలో పరిహారం అందుతుందని మంత్రి భరోసా ఇచ్చారు.