NLG: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా పోలీసు సూచనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుమతి లేకుండా న్యూ ఇయర్ కార్యక్రమాలు నిర్వహించడం నిషేధమన్నారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ప్రత్యేక పోలీస్ బృందాలతో గస్తీ ఏర్పాటు, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.