BHPL: జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న SC, ST, BC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరం ప్రీమెట్రిక్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 31 లోపు సంబంధిత పత్రలతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అర్హులు స్కాలర్షిప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.