ప్రకాశం: అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మల ప్రసాదిస్తుందని కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ అన్నారు. శనివారం కనిగిరి పట్టణంలో వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వాహన దారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి జీవితం నాశనం చేసుకోవద్దు అని సూచించారు.