MBNR: రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ వద్ద ఓ సాధారణ హోటల్లో సినీ నటుడు సాయికుమార్, ఆయన కుమారుడు ఆది సందడి చేశారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం కోసం వారు అక్కడ ఆగారు. విలాసవంతమైన హోటళ్లు కాకుండా రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్లో సినీ తారలు కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. తమ అభిమాన నటులతో ఫొటోలు దిగేందుకు స్థానికులు ఉత్సాహం చూపారు.