అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఈనెల 29న సోమవారం ఉదయం 9 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేయవచ్చని, గతంలో ఇచ్చిన దరఖాస్తుల రశీదులను వెంట తీసుకురావాలని సూచించారు.