SS: పిల్లల ఆరోగ్యానికి అంగన్వాడీలే పునాది అని రాష్ట్ర మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండలో శనివారం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 459 మంది అంగన్వాడీ కార్యకర్తలకు శామ్సంగ్ 5జీ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ ఫోన్లను పంపిణీ చేస్తోందన్నారు.