MLG: వెంకటాపూర్ మండలం వెల్తుర్లపల్లి క్రాస్ వద్ద బైక్ అదుపు తప్పి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామానుజాపూర్ గ్రామానికి చెందిన గుర్రాల అన్విత్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. వైద్య సిబ్బంది క్షతగాత్రుడిని వరంగల్ ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.