NLR: కావలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ప్రచార రథాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి పట్టణంలోని 40వ వార్డులో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధిలో పారిశుద్ధ్యం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత తీసుకోవాలన్నారు.