SRPT: నూతన సంవత్సర వేడుకల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. బహిరంగ వేడుకలు, రహదారులపై కేక్ కటింగ్, డీజేలు, బాణాసంచాపై నిషేధం ఉందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే ‘డయల్ 100’కు కాల్ చేయాలని కోరారు.