NLG: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి అభిమానులు చిట్యాలలో ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు వెళుతున్న క్రమంలో శనివారం ఆయన చిట్యాలలో కొద్దిసేపు ఆగారు. అభిమానులు జంపాల వెంకన్న, జిట్ట బిక్షం, జిట్ట దుర్గేష్, శ్రీకాంత్, ముత్యాలు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు.