కోనసీమ: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి హెచ్చరించారు. శనివారం గోకవరం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ, యువత జూదానికి దూరంగా ఉండాలని సూచించారు. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ వంటి సంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తూ పండుగను ఆనందంగా, చట్టబద్ధంగా జరుపుకోవాలని తెలిపారు.