KDP: జిల్లాలో శనివారం పోలీసుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ జరిగింది. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై, ఆయుధాల పనితీరును స్వయంగా పరీక్షించారు. విధుల్లో వాడే ఆయుధాలపై పూర్తి అవగాహనతో పాటు, అత్యవసర సమయాల్లో ప్రజల రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, ఫైరింగ్ మెళకువలు నేర్చుకోవాలని సిబ్బందికి ఆయన సూచించారు.