ADB: నార్నూర్ మండలంలోని చొర్గావ్ గ్రామంలో శనివారం అఖండ హరినామ మహా యజ్ఞ కార్యక్రమం పోస్టర్ను సంత్ శ్రీరామ్ మహారాజ్ విడుదల చేశారు. తలమడుగు మండలంలోని పల్సి(బి) తండాలో జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు నారాయణ మహారాజ్ ఆధ్వర్యంలో రథమహోత్సవం, భాజనం, దేవతలకు మహాహారతి కార్యక్రమాలు ఉంటాయన్నారు. దీంతో ప్రజలు, భక్తులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.