KMM: మధిర మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థుల కోసం తెలంగాణ మాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో మధిర టీవీఎం ఉన్నత పాఠశాలలో శనివారం టాలెంట్ టెస్ట్‌ను ప్రారంభించారు. దీన్ని జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ చుంచు రామకృష్ణ, MEO వై. ప్రభాకర్ ప్రారంభించినట్లు టెస్ట్ కన్వీనర్ పఠాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.