VZM: రామభద్రపురం, కోటసిర్లాం గ్రామంలో రైతుసేవా కేంద్రాన్ని శనివారం బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు. కోటసిర్లాం గ్రామ రైతులకోసం రైతుసేవా కేంద్రం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే కోటసిర్లాం రెవిన్యూ కింద ఉన్న అన్ని గ్రామాల రైతులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా, కలెక్టర్‌తో మాట్లాడి వెంటనే పరిష్కారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు.