AP: మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల, డివిజన్లు, మండలాల పునర్విభజనపై అంశంపై చర్చించారు. గతనెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఈ సమావేశంలో సమీక్షించారు.