NLG: కట్టంగూర్ మండలం ఎర్రసానిగూడెం గ్రామంలో మేకలు, గొర్రెలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ ఆకిటి శంకర్ మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని పెంపకందారులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎస్ఏ అరుణ, గోపాల మిత్ర చెరుకు శ్రీనివాస్, కాడారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.