KRNL: రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ నెల 30 నుంచి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ విధానం అమలు చేస్తున్నట్లు కర్నూల్ ట్రాఫిక్ సీఐ మనసురుద్దీన్ తెలిపారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వరన్నారు. నగరంలో ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.