NDL: అవుకు రిజర్వాయర్ రివిట్మెంట్ కుంగిన ప్రాంతంలో లీకేజీని SRBC అధికారులు గుర్తించారు. అక్షిత కంపెనీ సాంకేతిక సహకారంతో నీటి అడుగు భాగంలో తనిఖీలు నిర్వహించి, లీకేజీ ప్రాంతాన్ని అండర్‌గ్రౌండ్ లిక్విడ్ సిమెంట్‌తో పూడ్చి నీటి వృథాను అరికట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈ కబీర్ బాషా, డీఈ సాయికిరణ్ పాల్గొన్నారు.