VSP: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఈనెల 30న వైకుంఠ ద్వార దర్శనం విశేషంగా నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 5:30 గంటల నుంచి 11:00 గంటల వరకు మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారంలో కొలువై వైకుంఠ వాసునిగా భక్తులకు దర్శన భాగ్యం ఇస్తారు. ఈ సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో ఎన్.సుజాత తెలిపారు.