W.G: వ్యవసాయంలో రసాయన ఎరువులు అధికంగా వాడకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తణుకు మండలం దువ్వలో శుక్రవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సహజ సిద్ధంగా తయారుచేసిన ఎరువులు మాత్రమే వినియోగించాలని సూచించారు. జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు.