కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళాలో శుక్రవారం కర్ణాటకకు చెందిన సేల్స్ డైరెక్టర్ రాజిమోన్ మితల్ ఏకంగా రెండున్నర కిలోల బంగారం ధరించి చూపరులను ఆకర్షించారు. గోల్డ్ వేసుకుని బయటికి వెళ్లాలంటేనే భయపడే ఈ రోజుల్లో తనకు ఎలాంటి భయం లేదని, 5 కిలోల గోల్డ్ ధరించడమే తన లక్ష్యమన్నారు. మెడలో కేజీ, రెండు చేతులకు కేజీన్నర బంగారు ఆభరణాలు ధరించారు.