ADB: బజరహత్నూర్ మండలంలోని మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని చందునాయక్ తాండ గ్రామస్తులు శుక్రవారం రాత్రి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.