WNP: విధి నిర్వహణలో భాగంగా మరమ్మతులు చేస్తుండగా విద్యత్ షాక్తో గురై ఓ కాంట్రాక్ట్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మదనాపురం మండలం దంతనూరుకు చెందిన యాదగిరి గురువారం కొత్తకోటలో ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద పని చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ రావడంతో ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.