NDL: డోన్ మండలంలోని రూరల్ సీఐ రాకేశ్ ఆధ్వర్యంలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని గురువారం పోలీసులు ధ్వంసం చేశారు. 30 కేసులకు సంబంధించిన 90 ml టెట్రా ప్యాకెట్లు, 180 ml క్వార్టర్ బాటిళ్లు, 750 ml బాటిళ్లు, నాటు సారా, ఇతర రాష్ట్రాల మద్యం కలిపి మొత్తం 820.56 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు సీఐ పేర్కొన్నారు.