ఓ షోరూమ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతపై సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అభిమానులు దగ్గరగా వస్తే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని, వారిలో చాలామందికి ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండవని తెలిపింది. అభిమానంతో, ఆనందంగా దగ్గరికి వస్తారని పేర్కొంది. కానీ ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా, బాధ్యతతో ఉంటే సరిపోతుందని తెలిపింది.