ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా నియమితులైన బల్లా పల్లవి గురువారం టీడీపీ కార్యాలయంలో MLA దగ్గుపాటి ప్రసాద్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించి తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పల్లవిని శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే, పదవిలో రాణించి రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతూ అభినందనలు తెలియజేశారు.