TPT: పాకాల మండలం తోటపల్లి పంచాయతీ సునపరాల్ల మిట్ట సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. CI సుదర్శన ప్రసాద్ వివరాల ప్రకారం.. ఓ లారీ డ్రైవర్ టైర్లలోని గాలి తనిఖీ చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన బోలేరో ఢీకొట్టింది. గాయపడ్డ డ్రైవర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. దీనిపై పాకాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.